వరంగల్, ఫిబ్రవరి 10: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. వైభవంగా సమ్మక్క సారలమ్మ మండమెలిగే పండుగ ప్రారంభం అయ్యింది. డోలు వాయుద్యాలతో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం గ్రామ దేవతలు సమ్మక్క-సారక్క దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని మంత్రి సత్యవతి రాథోడ్ ఏర్పాట్లు పర్యవేక్షించారు మండమెలిగే పండగలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నారు.మేడారం జాతర ముహార్త సమయం దగ్గర పడింది. ఈనెల 16 న సమ్మక్క, సారలమ్మ జాతర మొదలు కానుంది. ఈ నేపధ్యంలో ఈరోజు మండమెలిగే పండుగ రోజు ను ప్రారంభించారు.
దీంతో మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సమ్మక్క, సారలమ్మ గుడుల్లో అలుకు
పూతలు చేసి ముగ్గులు వేశారు. రెండు గ్రామాలకు బూరక గుంజలతో ద్వార స్తంభాలు ఏర్పాటు చేసి రక్షా తోరణాలుకట్టారు. గ్రామ దేవతలకు పూజలు చేసి జాతర ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడాలని వేడుకున్నారు. సమ్మక్క సారలమ్మ. వనం వీడి జనం చెంతకు… వచ్చే సమయం ఆసన్నం కానుంది. అయితే ఇప్పటికే మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.