లారీ, కారు ఢీ… ముగ్గురు దుర్మరణం
కర్నూలు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు అనంతపురం జిల్లా ధర్మవరంకి చెందిన శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి , ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఈ రోజు ఉదయం ధర్మవరం కేశవ నగర్ నుండి హొండా సిటీ కారులో హైదరాబాద్ కు ఆసుపత్రి వెళ్తుండగా కర్నూలు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.