మహారాష్ట్రలో రాజకీయ దుమారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న ఫొటో ఒకటి మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సీఎం కుర్చీలో కూర్చున్న ఫొటో ఇది. ఆ గదిలో ప్రభుత్వాధికారులు నిల్చుని ఉన్నారు. అంతేకాదు, ఆయన చేతిలో ఓ ఫైల్ ఉండడం ఈ మొత్తం దుమారానికి కారణమైంది. ఈ ఫొటో వెలుగులోకి రావడంతో విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్నాయి.

 

ఈ విమర్శలపై శ్రీకాంత్ షిండే స్పందించారు. ముఖ్యమంత్రి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన చాలా సమర్థుడైన సీఎం అని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో థానే నివాసంలోనిదని, అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదని వివరణ ఇచ్చారు. సీఎంతోపాటు తాను కూడా దానిని ఉపయోగించుకుంటూ ఉంటానని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More