జగ్గయ్యపేట మండలం,చిల్లకల్లు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీ సూపర్ వైజర్స్ ఒత్తిడిలతో అంగన్ వాడీ టీచర్లు రాజీనామాల పర్వం కొనసాగుతోందని కథనంతో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కె గ్లోరి స్పందించారు.ప్రాజెక్ట్ పరిధిలో సూపర్ వైజర్స్ అంగన్ వాడీ టీచర్ల పై ఒత్తిడిలు ఉన్న విషయాన్ని ఎవ్వరు సిడిపిఒ దృష్టికి తీసుకొని రాలేదని ఆమె తెలిపారు.చిల్లకల్లు ప్రాజెక్ట్ పరిధిలో వేదాద్రి సెక్టర్ నుండి వేదాద్రి గ్రామం నుండి అన్నపూర్ణ,పోచంపల్లి గ్రామం నుండి పద్మా వీరిరువురు వారి వ్యక్తిగత కుటుంబ కారణాలతో వారు రాజీనామా చేసారని ఆమె తెలియజేశారు.జగ్గయ్యపేట మండలంలో స్థానిక నివాసముంటున్న వారు ముగ్గురు సూపర్ వైజర్స్ ఉన్నారని ఆమె తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్ వాడీ టీచర్లు,సూపర్ వైజర్స్ ల సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరు పని చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు మరియు ప్రాజెక్ట్ కి మంచి పేరు తీసుకురావాలని ఆమె తెలియజేశారు.చిల్లకల్లు ప్రాజెక్ట్ పరిధిలో రిపోర్టుల సేకరించడానికి సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడు తెలియజేసే రాష్ట్ర ప్రభుత్వ ఆన్ లైన్ సమాచార సేకరణ వల్ల సూపర్ వైజర్స్ టీచర్లతో సరైన బాధ్యత,సఖ్యతతో మెసలకపోవడం,సూపర్ వైజర్స్ పెత్తనం చేయాలని ఆలోచనలను చేయడం మూలానా ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురౌతున్నామని టీచర్ల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనితో టీచర్లలో పలువురు అనారోగ్యాల పాలౌతున్నారు.సమయపాలన లేని ఒత్తిడి పనుల వల్ల రాష్ట్రంలో ఒక్కరిద్దరు అంగన్ వాడీ టీచర్లు సైతం మరణించడంతో,చిల్లకల్లు ప్రాజెక్ట్ పరిధిలో కొంతమంది అంగన్ వాడీ టీచర్లు రాజీనామాలు చేయడానికి ముందుకు వస్తున్నారని సమాచారం తెలుస్తోంది.స్లోగా ఉండి సక్రమంగా పని చేయని స్మార్ట్ ఫోన్ సర్వర్లు,అంగన్ వాడీ టీచర్ల పై ఒత్తిడి లు తగ్గించి, రాజీనామాలు ఆపేలా చూడాలని ప్రభుత్వానికి జగ్గయ్యపేట నియోజకవర్గ ఎఐటియుసి గౌరవాధ్యక్షులు జూనెబోయిన శ్రీనివాసరావు అధికారులకు పత్రికా ముఖంగా తెలియజేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.