తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభానికి మరో 3 కలెక్టరేట్లు
హైదరాబాద్:* రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్,జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ),18న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.
12న ఉదయం మహబూబాబాద్ కలెక్టరేట్‌ను, మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు.ప్రభుత్వ సేవలన్నీ సింగిల్ విండో పద్ధతిలో ఒకేచోట అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మించారు.
29 జిల్లాల్లో రూ.1,581.62 కోట్ల వ్యయంతో జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాలు, మరో రూ.206.44 కోట్లతో 24 జిల్లాల్లో కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు,డీఆర్వోలు, ఇతర జిల్లా స్థాయి అధికారుల నివాస క్వార్టర్లను నిర్మిస్తున్నారు. సిద్దిపేట,కామారెడ్డి, హనుమకొండ,రాజన్న సిరిసిల్ల,జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి,మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి,పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాల,వికారాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కలెక్టరేట్లను ప్రారంభించారు. తాజాగా మహబూబాబాద్, భద్రాద్రి,ఖమ్మం జిల్లాల కలెక్టరేట్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.