*ఖమ్మం సిటి బస్టాండ్‌ను ప్రారంబించిన మంత్రి పువ్వాడ*
*ఖమ్మం:* ఖమ్మం పాత బస్టాండ్‌ను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సంకల్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిటీ బస్టాండ్‌గా మార్చి గురువారం లాంచనంగా ప్రారంభించారు.ఎంతో చరిత్ర గలిగిన ఖమ్మం బస్టాండ్‌ను రూ. 50 లక్షలతో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి పువ్వాడ అన్నారు.అనంతరం సిటి సర్వీసెస్‌లను కూడా జెండా ఊపి ప్రారంభించారు.పాత బస్టాండ్‌ను పునరుద్దరణ చేయడం పట్ల స్థానిక వ్యాపారులు,వివిద పనుల నిమిత్తం ఖమ్మం వచ్చే ప్రజలు,ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ గజమాలతో మంత్రి అజయ్‌కుమార్‌ను సత్కరించారు.వారి వెంట ఎంపీ నామా నాగేశ్వరరావు,మేయర్ పునుకొల్లు నీరజ,డిప్యూటీ మేయర్ ఫాతిమాజోహార, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, కార్పోరేటర్లు,నాయకులు పాల్గొన్నారు.