*ఇవి భోగి మంటలు కాదు..జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చితి మంటలు..నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.*
ఇవి భోగి మంటలు కాదని,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చితి మంటలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు.14.01.2023 శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో చిలకలూరిపేట అఖిలపక్షం ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేసి అందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో నంబర్ ఒకటి ని తగులబెట్టారు.కార్యక్రమంలో పాల్గొన్న రావుసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జీవో నంబర్ వన్ రద్దు చేయకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలే రద్దు చేస్తారన్నారు.ఈ జీవో ఆర్టికల్19 కి వ్యతిరేకంగా ఉందన్నారు. అందుకే హైకోర్టు ఈ జీవో సస్పెండ్ చేసిందన్నారు.*