నేడు శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 8:  గాజులరామారం డివిజన్ పరిధి జీడిమెట్ల బస్ డిపో ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం ఆఖరి శనివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ కమిటీ సభ్యులు ఆముర ఇంద్రసేన గుప్తా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి స్వామివారికి అభిషేకము, అర్చనలు, సాయంత్రం 5 గంటలకు స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై స్వామివారి పూజా కార్యక్రమాన్ని కనులారా తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు కోరారు

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More