కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదింటి ఆడపిల్లలకు వరం. -ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 20: పేదింటి ఆడపిల్లలు పెళ్లికి ఆర్దికంగా ఇబ్బందులు పడద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. నియోజకవర్గ పరిధికి చెందిన 232 మంది లబ్ధిదారులకు రూ. 2, 32, 26,912 విలువచేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను చింతల్లోని తన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బుధవారం పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.