విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 22: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు కూన కృష్ణ గౌడ్ – మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం రాత పుస్తకాలు, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను అందజేశారు. ఈ సందర్బంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…విధ్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. తన సోదరుడు కూన శ్రీశైలం గౌడ్ తో పాటు తాము ప్రభుత్వ బడుల్లో చదివామని..విద్యార్థి దశలో ఉండే సమస్యలు తమకు తెలుసు కాబట్టే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ రాము గౌడ్ , నాయకులు విగ్నేశ్వర్ , పీసరి కృష్ణా రెడ్డి , ఆకుల విజయ్ సాయి, దొడ్ల కృష్ణ , వెంకటేష్ నాయక్, రోజా, రాములు, పాండు, శ్రీనివాస్ గౌడ్, ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.