కులమతాలకు అతీతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
కొంపల్లి (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 22: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి, అపర్ణ ఫార్మ్ గ్రోవ్స్, రియల్ పార్క్ లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్‌తో కలిసి శుక్రవారం సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి సన్నాకవిత, స్థానిక కౌన్సిలర్ లు, సన్నా రవి యాదవ్, రవీందర్ యాదవ్, వసంత, సువర్ణ,జందా మంజుల, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మంగమ్మ, సీనియర్ నాయకులూ దేవేందర్ యాదవ్, జందా కుమార్,లక్ష్మణ్ గౌడ్,బొల్లం వేణు యాదవ్,కృష్ణ, వినోద్, ప్రవీణ్, సన్నా రాజు, మహిళా అధ్యక్షులు సంగీత రెడ్డి, మరియు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.