రైతులు ఆర్థికంగా చితికిపోకుండా సహకార సంఘాలు తోడ్పాటును అందిస్తున్నాయి. -ఎమ్మెల్యే వివేకానంద్
- దూలపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శాఖ కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే.
కొంపల్లి (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 24: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు రుణాలను అందించడమే కాకుండా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొంపల్లి మున్సిపల్ పరిధి దూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు.
రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, అటువంటి కీలకమైన రంగానికి సేవలందించడంలో పీఏసీఎస్‌లదే ముఖ్య పాత్ర అన్నారు. రైతులు ఆర్థికంగా చితికిపోకుండా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని తెలిపారు. సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, చైర్మన్ డి నరేందర్ రాజు , మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు బి హన్మంత్, దేవేందర్, డైరెక్టర్లు బి సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, మల్లేష్, కృష్ణ యాదవ్, నరేందర్, శ్రీనివాస్ యాదవ్, నాగమణి, సావిత్రి, మాధవ్, సత్యనారాయణ, వైస్ చైర్మన్ రంగనాయక రావు , యాదగిరి, మహేష్ పాల్గొన్నారు.