రూ 100 కె బిర్యానీ అంటూ…వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం…
నిల్వ చికెన్ తో బిర్యాని…
చికెన్ ముక్కలు జిగురు జిగురుగా…
నిల్వ చికెన్ అని ఒప్పుకున్నా హోటల్ నిర్వాహకుడు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 5: ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యాని బిర్యాని రూ 100 కే వస్తుంది కదా అని ఇంటికి తీసుకెళ్ళిన బిర్యాని ప్రియులకు చుక్కెదురైంది. చింతల్ నుండి రామకృష్ణ నగర్ జయశంకర్ చౌరస్తా కు వెళ్లే ప్రధాన రహదారిలో ఎస్కె తాహీర్ బక్స్ అనే వ్యక్తి టేస్టీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్, మినీ రెస్టారెంట్ పేరుతో బిర్యానీ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. కాగా ఇతను కేవలం 100 రూపాయలకే బిర్యానీ అంటూ నిలువ ఉన్న చికెన్ బిర్యాని అమ్ముతూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
గురువారం మధ్యాహ్నం స్థానికంగా నివాసం ఉండే వెంకటేష్, వీరయ్య అనే ఇద్దరు యువకులు బిర్యానీ ఇంటికి పార్సల్ తీసుకువెళ్లారు. అక్కడ తిందామని ఓపెన్ చేయగా ఒక్కసారిగా దుర్వాసన వచ్చింది. చికెన్ పీసులు పట్టుకొని చూడగా జిగురులా సాగాయి అని వినియోగదారులు పేర్కొన్నారు. దీంతో వెంటనే బిర్యానీని తిరిగి హోటల్ వద్దకు తీసుకువెళ్లి హోటల్ యజమానిని గట్టిగా నిలదీయడంతో బిర్యానీ లో ఉన్న చికెన్ పీసులు నిల్వ ఉన్నది వాస్తవమేనని అంగీకరించాడు.
దీంతో ఆగ్రహించిన వినియోగదారులు హోటల్ ను ముట్టడించారు. నిలువ ఉన్న కల్తీ బిర్యానీని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ యజమాని పై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు.శుక్రవారం తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.