✓ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్
✓ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 9: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ పై విలేకరుల సమావేశాన్ని నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్రంతో సహా మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆయా రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు తేదీలను ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహించే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ జాబితా ఎన్నికల నిర్వహణ వాటి భద్రత విషయాలతో పాటు ఇతరత్రా అంశాలపై ఈసీఐకి నివేదిక అందించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన 24 గంటల అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ రేపు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.