తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా…
నవంబర్ 30న ఎన్నికలు
3వ తేదీన ఫలితాలు
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 9: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించినట్లు ఈ సీఐ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈరోజు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం…
~ రాష్ట్రంలో నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల
~ నవంబర్ 10వ తేదీ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు చివరి తేదీగా ప్రకటించారు.
~ నవంబర్ 13వ తేదీతో నామినేషన్ల స్క్రుటిని (పరిశీలన)ముగుస్తుంది.
~ నవంబర్ 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.
తెలంగాణతోపాటు మిజోరాం, చతిస్గడ్ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో కూడా డిసెంబర్ 3వ తేదీ నాటికి ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తుందని వివరించారు. డిసెంబర్ ఐదో తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎన్నికల కోడ్ ) అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.