సెక్టోరల్ అధికారుల పర్యవేక్షణలో ఓటర్ స్లిప్పుల పంపిణీ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 17: నియోజకవర్గంలోని ప్రతి ఓటర్కు ఓటర్ సమాచార స్లిప్పులను తప్పకుండా అందించాలని ఆర్వో పులి సైదులు అన్నారు. సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ స్లిప్పుల పంపిణీ సందర్భంగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ స్లిప్పులో పోలింగ్ బూత్ పేరు, క్రమ సంఖ్య, పార్ట్ వివరాలు ఉంటాయన్నారు. ఓటరు సమాచార స్లిప్పు గురించి ఓటర్లకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.
ఓటర్ స్లిప్పులతో పాటు ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని అన్నారు. ఎవరి ఓటర్ స్లిప్పు వారికి మాత్రమే ఇవ్వాలని, ఒకరి ఓటర్ స్లిప్పు మరొకరి చేతిలో ఉండడం నేరంగా పరిగణించబడుతుందని ఆయన సూచించారు