కుత్బుల్లాపూర్ లో ప్రారంభమైన సమ్మర్ ఉత్సవ్ మేళా
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 24 : కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళాను మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ శుక్రవారం ప్రారంభించారు. అవతార్ సినిమాలో వివిధ పాత్రలలో కనిపించే గ్రహాంతర వాసులు (ఏలియన్స్) మేళలో ప్రత్యేకంగా నిలిచి పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ జోన్ లో 15 రకాల వివిధ రైడ్స్, ఎమ్యూజ్మెంట్ రైట్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశారు. ఏలియన్స్ విన్యాసాలను సమ్మర్ ఉత్సవ్ మేళాలో నేరుగా చూసి అనుభూతి చెందవచ్చు అని గౌరీష్ అన్నారు.
ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సమ్మర్ ఉత్సవ్ మేళా అందుబాటులో ఉండనుంది. ఈ అవకాశాన్ని సందర్శకులు ఉపయోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు.