బీదర్ లో కుత్బుల్లాపూర్ బిల్డర్ దారుణ హత్య

~ నమ్మిన వాళ్లే  నరరూప రాక్షసులా…

~ ఆర్థిక లావాదేవీలే కారణమా … మరి ఏదైనానా…

~ హతమార్చి  ఒంటిమీద బంగారంతో ఉడాయింపు 

~ పలు అనుమానాలకు తావిస్తున్న  కుత్బుల్లాపూర్ బిల్డర్ హత్య ఉదంతం 

~ పరారీలో అనుమానితులు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 27 :  నమ్మి తోడుగా తీసుకెళ్లిన వారే నరరూప రాక్షసులుగా మారి మృత్యు ఒడికి చేర్చారా..? కావాలనుకున్న వారే…కావాలని ఖతం చేశారా..? మిత్రులనుకున్న వారే..శత్రువులుగా మారి హతమార్చారా..? లేక మరేవరైనానా…? అందుకు ఆర్థిక లావాదేవీలే కారణమా… లేక ఇంకేమైనానా…? ఇవన్నీ ఓ బిల్డర్ (భవన నిర్మాణ దారుడు) హత్య విషయంలో ప్రస్తుతం కుత్బుల్లాపూర్ లో తలెత్తుతున్న అనుమానాలు.

మధు మృతదేహం

వివరాల ప్రకారం…

కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మానగర్ ఫేజ్-1కు చెందిన బిల్డర్ కుప్పాల మధు శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో కర్ణాటకలోని బీదర్ జిల్లా, మన్నాకెళ్లి పోలీస్టేషన్ పరిధి తల్మడిగి ప్రాంతంలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన మూనేసిన ఓ దాబా వద్ద నిర్మానుష్య ప్రదేశంలో దారుణ హత్యకు గురైయ్యాడు. పగిలిన బీరు సీసాలతో మధు గుండెల్లో బలంగా పొడవడంతో పాటు కడుపు భాగంలో, చేతులపై విచక్షణారహితంగా చీరడమే కాకుండా రాయితో ముఖంపై మొది హత్య చేసినట్లు తెలుస్తుంది. మధుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… మధును శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన కల్పనా సొసైటీకి చెందిన మిత్రుడు రేణుకా ప్రసాద్, మరో ఇద్దరు నిఖిత్, పి. గోపిలు ఇంటి నుంచి తీసుకెళ్లారన్నారు. అనంతరం ఇంట్లో వారికి ఫోన్ చేసి సదరు ముగ్గురితో కలిసి పని మీద బీదర్ వెళ్తున్నామని మధు చెప్పాడు. అనంతరం రాత్రి మరోమారు ఫోన్ చేసి ఇంటికి తిరిగి బయదేరి వస్తున్నామని తెలిపాడన్నారు.  శనివారం ఉదయం పోలీసులు మదు హత్యకు గురయ్యాడని సమాచారం ఇవ్వడంతో దిగ్భ్రాంతికి లోనై వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నామన్నారు.

కారు నెంబర్ ఆధారంగా….

శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో హత్య జరిగి ఉంటుందని భావిస్తుండగా శనివారం
తెల్లవారుజామున ఓ పశువుల కాపరి అటుగా వెళ్తూ కారు, పక్కనే రక్తపు మడుగులో పడి ఉన్న మధు మృత
దేహాన్ని గుర్తించి వెంటనే మన్నాకెళ్లి  పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో సంఘటనా స్థలికి చేరుకున్న
పోలీసులు అక్కడ ఉన్న మధు కారు నెంబరు ఆధారంగా వివరాలు సేకరించి శనివారం ఉదయం సుమారు 9.30
గంటలకు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియపరిచారు. శనివారం పోస్టుమార్టం అనంతరం అర్ధరాత్రి 12.30
గంటలకు మధు మృతదేహాన్ని కుత్బుల్లాపూర్ తీసుకు వచ్చారు.

తోటి వారి పనేనని అనుమానం..

మధుతో పాటు వెళ్లిన మరో ముగ్గురు రేణుకా ప్రసాద్, నిఖిత్, గోపి లు హత్య చేసి డబ్బు. ఒంటి మీద ఉన్న బంగారంతో ఉడాయించారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధు ఒంటి
మీద సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు బంగారు విలువ ఉంటుందని సమాచారం. సమీపంలోని టోల్ గేట్లలోని సీసీ ఫుటేజీలు ఆధారంగా మధుతో పాటు ఆ ముగ్గురే ఉన్నారని, పైగా వారి ఫోన్లు స్వీచ్ ఆఫ్
చేసుకోవడంతో పాటు జాడ లేకపోవడం వంటి పలు అంశాలు అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More