కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 4 : మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీసరలోని హోళీమేరీ కళాశాలలో ప్రారంభమై తొలి రౌండ్ ముగిసింది. తొలి రౌండ్లో మొత్తం 1,04,785 ఓట్లను లెక్కించారు. అధికారిక లెక్కల ప్రకారం ఫలితాలు ఇలా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 51,438 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితా మహేందర్‌రెడ్డికి 32,892 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 17,697 ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలి రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ సమీప ప్రత్యర్థి సునితా మహేందర్ రెడ్డి కన్నా 18,546 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల కన్నా నోటాకు అధిక ఓట్లు లభించాయి. తొలి రౌండ్ లో నోటాకు 603 ఓట్లు రావడం విశేషం.