~ 2 కిలోల 100 గ్రాముల గంజాయి స్వాధీనం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 4 : బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూసాపేట మెట్రో స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జె జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో సోదా చేయగా అతని వద్ద 2 కిలోల 100 గ్రాములు గంజాయి పట్టుబడింది. ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లా శాంతినగర్ కు చెందిన బాబుల కరాడ్ ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. దీంతో సదరు వ్యక్తిని అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. గంజాయి పట్టుకున్న వారిలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చంద్ర, ఎస్ఐ వెంకటేష్ , సిబ్బంది ఉన్నారు.