కూకట్ పల్లి జెడ్ సి అభిలాష అభినవ్ బదిలీ
~ నిర్మల్ జిల్లా కలెక్టర్ గా నియామకం
~ ప్రస్తుతం ఖాళీగా ఉన్న కూకట్ పల్లి జెడ్ సి స్థానం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 15 : జిహెచ్ఎంసి కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ (ఐఏఎస్) శనివారం బదిలీ అయ్యారు. ఆమెను నిర్మల్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం అప్పటి జడ్సీ మమతను బదిలీ చేసి జనవరి మొదటి వారంలో అభిలాష అభినవ్ ను కూకట్ పల్లి జడ్సీగా నియమించడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. సుమారు 5 మాసాల పాటు జెడ్ సిగా కొనసాగిన ఆమె ను బదిలీల్లో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ గా నియమించారు. జెడ్ సి బదిలీతో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ స్థానంలో ఎవరిని నియమించకపోవడంతో ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది.