కూకట్ పల్లి ఇన్చార్జి జోనల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 17 : జిహెచ్ఎంసి కూకట్పల్లి జోన్ ఇన్చార్జి జోనల్ కమిషనర్ గా స్నేహ శబరీష్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన అభిలాష అభినవ్ (ఐఏఎస్) ను నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్నేహ శబరిష్ కు కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర జారీ చేయడంతో ఇన్చార్జి జోనల్ కమిషనర్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు.