కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి అపూర్వ్ చౌహన్

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 25: జిహెచ్ఎంసి కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి అపూర్వ్ చౌహాన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్ జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహించిన అపూర్వ్ చౌహాన్ బదిలీపై కూకట్పల్లి జడ్సీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తుంది. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా ఇటీవల విధులు నిర్వహించిన ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ ను నిర్మల్ జిల్లా కలెక్టర్ గా నియమించడంతో ఆ స్థానంలో ఇప్పటివరకు ఇప్పటి వరకు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More