ఉన్నతాధికారి సీజ్… సెక్షన్ అధికారి రిలీజ్…!

~ ఉన్నతాధికారి సీజ్ చేసినా కొనసాగుతున్న అక్రమ షెడ్డు నిర్మాణం
~ సర్కిల్ కార్యాలయంలోనే దర్జాగా నిర్మాణదారుడితో బేరసారాలు
~ పట్టణ ప్రణాళికా విభాగంలో ఓ సెక్షన్ అధికారి చేతివాటం
~ ఆంతా తానై ఆక్రమార్కులకు ఆండగా
~ ఆందినకాడికి దండుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 23 : ఉన్నతాధికారులు ఆక్రమ షెడ్డులను, ఆక్రమ భవన నిర్మాణాలను సంబంధిత విభాగ అధికారులు, సిబ్బందితో కలిసి వెళ్లి సీజ్ చేస్తారు.. ఆనాక సంబంధిత అధికారులు ఆక్రమార్కులను కార్యాలయానికి పిలిపించి బేరసారాలు పెడతారు. అక్కడ బెదిరించి ఇక్కడ కార్యాలయంలో రాజ
మర్యాదలతో దర్జాగా కూర్చోబెట్టి బేరం కుదుర్చుకుంటారు. దాంతో ఇక అక్రమం అంతా సక్రమంగా మారి సర్కిల్ పరిధిలో సదరు నిర్మాణాలు మూడు షెడ్లు, ఆరు భవనాలుగా
విరాజిల్లడం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో పరిపాటిగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆక్రమ నిర్మాణదారుల నుంచి ఆందినకాడికి దండుకొని జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం వారికి ఆనవాయితీగా మారింది.

నేడు పూర్తవడానికి సిద్ధంగా ఉన్న అధికారులు సీజ్ చేసిన షెడ్డు

• వాళ్లు సీజ్ చేస్తారు… వీళ్లు పూర్తి చేసుకుంటారు…
కుత్బుల్లాపూర్ సర్కిల్లోని సుభాష్ నగర్ డివిజన్ పరిధి రాంరెడ్డి నగర్లో సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి నిర్మాణ అనుమతులు పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి భారీ అక్రమ షెడ్డును నిర్మిస్తున్నాడు. సదురు షెడ్డుపై అందిన పలు ఫిర్యాదుల మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉపకమిషనర్ వి. నర్సింహా అప్పటి ప్రట్టణ ప్రణాళికా విభాగ ఏసీపీ సాయిబాబా, టీపీఎస్ ప్రభావతితో కలిసి వెళ్లి షెడ్డును పరిశీలించి అక్రమ షెడ్డుగా నిర్ధారించుకొని ఆగస్టు 17వ తేదీన సీజ్ చేశారు.

సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ అధికారి ప్రభావతితో షెడ్డు నిర్మాణదారుడి మంతనాలు

ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.. ఏసీపీ సాయిబాబా కుత్బుల్లాపూర్ సర్కిల్ నుంచి శేరిలింగంపల్లి సర్కిల్ కు అప్పుడే బదిలీ కావడమే తడవుగా టీపీఎస్ ప్రభావతి సదరు షెడ్డు నిర్మాణదారుడితో సర్కిల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలోనే బేరసారాలు పెట్టి బేరం కుదరడంతో సీజ్ చేసిన అక్రమ షెడ్డు కాస్త నేడు పూరై ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. సర్కిల్ ఉన్నతాధికారి వచ్చి షెడ్డును సీజ్ చేశారన్న నదురుబెదురు ఆటు నిర్మాణదారుడికి గానీ.. ఇటు కింది స్థాయి అధికారికి గానీ లేకపోగా కార్యాలయంలోనే నిర్మాణదారుడు కాలుపై కాలు వేసుకొని మరీ దర్జాగా కూర్చోని ప్రభావతితో బేరసారాలు సాగించడం పలువరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విధంగా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ షెడ్లు, అక్రమ భవన నిర్మాణదారుల నుంచి అందినకాడికి దండుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు పట్టన ప్రణాళికా అధికారులు.

• త్వరలోనే సదరు షెడ్డును తొలగిస్తాం. – వి. నర్సింహా, ఉపకమిషనర్, కుత్బుల్లాపూర్ సర్కిల్
గతంలో రాంరెడ్డి నగర్లోని సదరు షెడ్డును అధికారులతో కలిసి వెళ్లి సీజ్ చేసిన మాట వాస్తవమే. షెడ్డును సీజ్ చేసిన ఆనంతరం కూడా నిర్మాణదారుడు నిర్మాణ పనులు చేపడుతున్నాడనే సమాచారం మా దృష్టికి వచ్చింది. దీంతో ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఎస్టీఎఫ్ (ప్రత్యేక టాస్క్ ఫోర్స్)కు సిఫార్సు చేశాం. త్వరలోనే సదరు షెడ్డును తొలగించేలా చర్యలు తీసుకుంటాం.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More