పార్టీ అభివృద్ధికి బాధ్యతాయుతంగా పని చేయాలి
• కార్యవర్గ విస్తరణలో బిజెపి బాచుపల్లి అధ్యక్షుడు ప్రసాద్ రాజు
• పార్టీలోకి భారీ సంఖ్యలో చేరికలు
నిజాంపేట (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 5 : పార్టీ అభివృద్ధికి బాధ్యతగా పనిచేస్తూ తమ వంతు కృషి చేయాలని బిజెపిలో నూతనంగా చేరిన సభ్యులతోపాటు కార్యవర్గానికి బిజెపి బాచుపల్లి అధ్యక్షుడు ప్రసాద్ రాజు సూచించారు. ఆయన ఆధ్వర్యంలో బాచుపల్లి బిజెపి పార్టీ కార్యవర్గాన్ని విస్తరించడంతో పాటు పార్టీలోకి పలువురిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
బిజెపి బాచుపల్లి కార్యవర్గ విస్తరణలో ఉపాధ్యక్షులుగా నారాయణమూర్తి, కార్యదర్శిగా హరిత, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా పావని, ప్రధాన కార్యదర్శిగా స్వాతి,16వ డివిజన్ అధ్యక్షుడిగా హనుమయ్య, ఉపాధ్యక్షుడిగా అశోక్, కార్యదర్శిగా రాజు, బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా చరణ్, ప్రధాన కార్యదర్శిగా జయసింహారెడ్డి, కార్యదర్శులుగాగా అవినాష్, కిషోర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రహ్లాద్, వర్మ, డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పద్మ, రవికుమార్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బాచుపల్లి 1వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, ఉపాధ్యక్షులు కాశి, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గజ్జల సంతోష్, ఓబిసి మోర్చా అధ్యక్షుడు ఉదయ్ కిరణ్, బీజేవైఎం అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సురేష్, బిజెపి సీనియర్ నాయకులు సాయి కృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్, వెల్నెస్ సెంటర్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.