కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 24: జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి బాపు నగర్ లోని ఆర్ ఎస్ కే పాఠశాలలో కేఐ ల్యాబ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ ఆర్ ఎస్ సి), ఇస్రో సహకారంతో పాఠశాల కరస్పాండెంట్ కే. రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇటువంటి అంతరిక్ష విజ్ఞాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం మొట్టమొదటిసారి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, ప్రజలకు ఇస్రో చేపట్టిన కార్యకలాపాలు, విజయాల గురించి నిపుణులు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానాసక్తి పెంపొందించడం, భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ప్రేరణను కలిగించడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇస్రో ప్రయోగాలు, ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థల ప్రదర్శనలను నమూనాలతో విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ ఆర్ ఎస్ సి, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. శ్రీనివాస్, జిల్లా గవర్నర్ లయన్ టి. రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, వినోద్ జాధవ్, శ్రీరాములు, దయాకర్, బుపాల్ రెడ్డి, నర్సింలు, బాషా, కేఐ ల్యాబ్ సీఈవో కరీం ఇమ్రాన్, పలు ప్రముఖ విద్యావేత్తలు, పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.