• ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించిన పెట్ బషీరాబాద్ పోలీసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 26: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం (ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే) సందర్భంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మా నగర్ ఫేజ్ 2లో ఎస్సై నరసింహులు ఆధ్వర్యంలో వాహనాల ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రధానంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని, మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్సులు లేని, హెల్మెట్లు పెట్టుకొని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవారితో పాటు ట్రిపుల్ రైడింగ్ చేసే ద్విచక్ర వాహనదారులను పట్టుకొని జరిమానాలు విధించడంతో పాటు వారికి అవగాహన కల్పించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే వారు కూడా బాధ్యులవుతారని తెలిపారు. ప్రతి వాహన చోదకులు సరైన వాహన పత్రాలు, లైసెన్స్ లతో మాత్రమే వాహనాలు నడిపి నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఏఎస్ఐ గాబ్రియల్, కానిస్టేబుళ్ళు ప్రకాష్, భాస్కర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.