• ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ఆల్వాల్ ట్రాఫిక్ పోలీసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 8: వాహనాల మైనర్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు అల్వాల్ ట్రాఫిక్ సిఐ ఎ. నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంజనీరింగ్ కళాశాలల వద్ద వాహనాల ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రధానంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని, మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్సులు లేని, హెల్మెట్లు పెట్టుకొని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవారితో పాటు ట్రిపుల్ రైడింగ్ చేసే ద్విచక్ర వాహనదారులను పట్టుకొని జరిమానాలు విధించడంతో పాటు వారికి అవగాహన కల్పించారు.

ఈ మేరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే 12, 3 మైనర్ డ్రైవింగ్ ద్విచక్ర వాహనాలతో మొత్తం 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే వారు కూడా బాధ్యులవుతారని తెలిపారు. ప్రతి వాహన చోదకులు సరైన వాహన పత్రాలు, లైసెన్స్ లతో మాత్రమే వాహనాలు నడిపి నిబంధనలను పాటించాలని సూచించారు.