కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం!
• రూ.2.50 లక్షల నగదుతో డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం!
కీసర (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 15: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని కీసరలో భూ సర్వేకు సంబంధించిన వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డితో పాటు విజయ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి.

భూ సర్వే వ్యవహారానికి సంబంధించి రూ.2.50 లక్షల నగదు తీసుకుంటున్న సమయంలో డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాలు, కేసుకు సంబంధించిన తదుపరి పరిణామాలు అధికారిక సమాచారం అందిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.