ఘోర ప్రమాదం.. రన్‌వేపై కూలిన విమానం*
*ఘోర ప్రమాదం.. రన్‌వేపై కూలిన విమానం*
పొఖారా: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై విమానం కూలింది. విమానం కుప్పకూలడంతో పొఖారా ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. విమానంలో 68మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.