తిరుమల ఫిబ్రవరి 16: హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. చారిత్రక, పురాణ, పౌరాణిక, ఇతిహాసాలు, శాసనాలతో కూడిన ఆధారాలతో అందనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా కమిటీ నిర్ధారించింది.
కమిటీ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో రావాలని బహిరంగ చర్చకు ఆహ్వానించామన్నారు. ఒక్కరిద్దరు వచ్చినా వారు ఆధారాలు సమర్పించలేదన్నారు. కమిటీ నివేదిక మేరకు అంజనాద్రి అభివృద్దికి స్వీకారం చుట్టామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.