జాతీయబాలికా దినోత్సవవారోత్సవాలు
జాతీయబాలికా దినోత్సవవారోత్సవాలు
జగ్గయ్యపేట
జాతీయ బాలికా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చిల్లకల్లు ఐసిడిఎస్ సిడిపిఓ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ గ్లోరి మాట్లాడుతూ సమాజంలో బాలికలపై జరిగే అకృత్యాలు, బాల్యవివాహాల నిలుపుదల, బాలికావిద్య, వారి హక్కులను గూర్చి వివరించారు. హెల్ప్ లైన్ నెంబర్లు మరియు దిశ యాప్ పై అవగాహన కల్పించారు. సమాజంలో ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు రజనిజ్వాల, దుర్గాదేవి, జోజికటాక్షం, కుమారి, లక్ష్మీకాంతమ్మ, సుజాత, మహిళా సంరక్షణ కార్యదర్శులు పూర్ణిమ, పవిత్ర మరియు అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.