జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటలలో కాల్చిన శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య )
జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటలలో కాల్చిన టిడిపి జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య )
జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టం అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ వారిని ప్రజల వద్దకు వెళ్లకుండా తెచ్చిన జీవో నెం1 ప్రతులను జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కొట్లసెంటర్ నందు తె.దే.పా నేతలతో కలిసి భోగి మంటలలో కాల్చిన శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ*
రాష్ట్రంలో సైకో పరిపాలన సాగుతుందనీ బ్రిటిష్ పరిపాలనలో కూడా ఈ విధంగా చేసినట్లయితే మన దేశానికి స్వతంత్రం వచ్చేది కాదన్నారు.
ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రంలో సైకో పరిపాలన పోయి సైకిల్ పరిపాలన అధికారంలోకి రావాలన్నారు.
ఈరోజు చూస్తే అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు అన్నారు కార్మికులు రైతులు ఉద్యోగస్తులు మహిళలు యువత ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నారు.
ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు ప్రజలందరికికూడా సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలుతెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కి ఆశీస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ కోరారు.
కార్యక్రమంలో శ్రీరాం సుబ్బారావు , శ్రీరాం చిన్నబాబు , గింజుపల్లి రమేష్, కానూరి కిశోర్, కర్రి చిన్న, కల్యాణం మురళి వార్డు కౌన్సిలర్ లు కన్నేబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, నకిరకంటి వెంకట్, సంగెపు బుజ్జబాబు,సామినేని మనోహర్, కర్ల జోజి, మెడక కోటేశ్వరరావు,మారేపల్లి శౌరి, మీసాల బాబ్జీ, మల్లెల కొండ, షేక్ మదార్,మారేపల్లి బాషా, షేక్ అన్వర్, పున్న ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు