ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కమల సెంటర్ వద్ద గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాo తాతయ్య మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య,
సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, . కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ కౌన్సిలర్లు పేరం సైదేశ్వరరావు, ఇర్రి నరసింహారావు, సంగెపు.బుజ్జి గొట్టే నాగరాజు తెదేపా నాయకులు గట్టిడి దుర్గాప్రసాద్, కానూరి కిషోర్, దులిపాళ్ళ లక్ష్మణరావు, దర్శి నరసింహారావు,కొరకూటి సైదులు, గుమ్మా మధు, మల్లెబోయిన.జ్వాలా,పితాని బ్రదర్స్, గజ్జి శివ, గుడారు.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.