అన్నవరం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్య నాయరాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే జూనియర్ కళాశాల అధ్యాపకులకు సంక్రాంతి పండుగ నాటికి కూడా జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2009 నుండి తాత్కాలిక ఉద్యోగులుగా చేరి గంటకు 225 రూపాయల చొప్పున వేతనం పొందుతున్నారు, కానీ ఇటీవలే జాయిన్ అయిన వారికి గంటకు 375 రూపాయల చొప్పున జీతం చెల్లిస్తున్నారు, 12 సంవత్సరములుగా విధులు నిర్వహిస్తున్న వారికి 225 రూపాయలు చెప్పను మాత్రమే చెల్లించడం పై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, 12 సంవత్సరములుగా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు న్యాయం చేస్తూ అందరికీ సమాన వేతనం 375 రూపాయల చొప్పున ఇవ్వవలసిందిగా చైర్మన్, ఈవో, స్థానిక ఎమ్మెల్యేలకు తమ సమస్య విన్నవించుకున్నామని కానీ ఎండోమెంట్ కమిషనర్ నుండి పాత అధ్యాపకులకు పెంపుదలకు అనుమతి రావాలని దేవస్థానం అధికారులు చెప్పడంతోతీవ్ర అసంతృప్తి చెందుతున్నారు, దానికి తోడు సంక్రాంతి నాటికి కూడా జీతాలు పడకపోవడంతో కొందరు అధ్యాపకులు సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గత 12 సంవత్సరములుగా చేస్తున్న వారికి జీతాలు పెంచడంతోపాటు జీతాలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుచున్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.