చిలకలూరిపేట మున్సిపాలిటీ అవినీతి పై ఏపీ మునిసిపల్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన రావుసుబ్రహ్మణ్యం
*చిలకలూరిపేట మున్సిపాలిటీ అవినీతి పై ఏపీ మునిసిపల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ కు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మెమోరాండం.*
చిలకలూరిపేట మునిసిపాలిటీ లో జరుగుతున్న అవినీతి గురించి తగిన చర్యలు తీసుకోవాలని 17.01.2023 మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ కు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మెమోరాండం అందజేశారు. చిలకలూరిపేట మునిసిపాలిటీ లో లక్షలాది రూపాయలు బిల్లులు తప్పుడు దస్త్రాలు పెట్టి డ్రా చేస్తున్నారు అని ,ప్రజా ధనాన్ని అధికారులు తప్పుడు విధానంలో బిల్లులు చేసుకుని అవినీతికి పాల్పడ్డారని మునిసిపల్ డైరెక్టర్ కు వివరించారు.సంబంధించిన వివరాలు ఆధారాలతో అందించారు.తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.డైరెక్టర్ మరియు కమీషనర్ పుర పరిపాలన శాఖ ఆంధ్రప్రదేశ్ కు అందించిన లేఖ వివరాలు మీడియా కు విడుదల చేసారు.చిలకలూరి పేట పురపాలక సంఘంలో అవినీతి . నిధుల విడుదల పై విచారణ జరిగాలని కోరారు. చిలకలూరిపేట మునిసిపాలిటీలో టి.వెంకటరమణ ఇంజనీరింగ్ విభాగానికి సంబందించిన ఈ1 గుమస్తా చేసిన పనుల దొంగ బిల్లుల ను గురించి వివరించారు.
సంబంధించిన వివరాలు ఆధారాలతో
( 1 ) శంకుస్థాపన పనుల్లో జరిగిన దొంగ బిల్లులు . పాత 3 వ వార్డు కొత్త పోలీసు స్టేషన్ ఎ దురు సాయిబాబా గుడివద్ద మునిసిపల్ స్కూలు పడగొట్టి కొత్తగా నిర్మించుటకు చేసిన ఖర్చు 5 కొబ్బరి కాయలు మాత్రమే . కానీ పెట్టిన సి 1 బిల్లు 48000.00 .
( 2 ) సుగాలికాలనీ మునిసిపల్ స్కూల్లో అదనపు తరగతి గది కట్టుటకు శంఖుస్థాపన అనిచెప్పి చేసిన ఖర్చు 9 కొబ్బరి కాయలు మాత్రమే . కానీ పెట్టిన సి బిల్లు 57000.00 .ఏఈ లు సంతకాలు లేకుండా డివైఈఈ చేసిన సి బిల్లులు వివరములు . రోడ్డులు మరియు డ్రైన్లు మరియు గ్రావెల్ రోడ్డులు
( 1 ) కొత్త 32 వ వార్డు భావనారుషి నగర్లో గ్రావెల్ రోడ్డు అని 500000.00 ఫైలు పెట్టి బిల్లు చేశారు
( 2 ) కొత్త 32 వ వార్డు భావనారుషి నగర్లో గ్రావెల్రోడ్డు అని 500000.00 రెండవ ఫైలు పెట్టియున్నారు . కానీ చేసిన పని విలువ 275000.00 చేసినబిల్లు 800000.00 . రాఖీ హెూమ్స్ ప్రైవేటు లాండ్లో రోడ్డు వేశారు . ఈఎన్సీ ఆఫీసు తాడేపల్లి విజిలెన్సు వారు కొలత తీస్తే దొంగ లెక్కలు బయటపడతాయి
( 3 ) 52 ఎకరాల్లోని ఏపిటిడ్కో లో ( 1 ) జంగిల్ క్లియరెన్స్ 500000.00 .
( 2 ) కొత్త ఫ్యాను పెయింటింగ్ 500000.00
( 3 ) మాన్ మజ్దూర్ 500000.00 .
( 4 ) రీఫ్రెష్ మెంట్స్ 500000.00 అని మొత్తం 2000000.00 . బిల్లులు పెట్టినారు . ఈ పనులు మొత్తం అక్కడ షాపూర్జీ పల్లోంజీ వారు చేయించినారు.కానీ మునిసిపాలిటీలో బిల్లులు పెట్టినారు .
( 4 ) మునిసిపాలిటీ చెత్త డంపర్ లారీలు 4 ఉన్నాయి . చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఫై రు స్టేషను ఎదురుగా చేసి 200000.00 బిల్లు పెట్టియున్నారు .
( 5 ) ఆయిల్ ఇండెంట్స్లో కూడా భారీగా అవినీతి జరిగినది , జరుగుతున్నది .
( 6 ) జంగిల్ క్లియరెన్సు పోతవరం గ్రామంలో పుల్ జేసిబితో చేసి 200000.00 అయింద ని కాంట్రాక్టర్ చేబితే దానికి సిల్టు ఓగేరు వాగు నుండి పోలేరమ్మ గుడి వరకు సిల్టు తీశారని 500000.00 బిల్లు చేశారు .
( 7 ) వాటరు సప్లై వాల్ ఆపరేటింగ్ వాల్స్ ఇప్పుడున్న డివైఈఈ సప్లయి చేసి 100000 . 00 ఫైల్సు పెట్టి బిల్లులు తీసుకున్నారు . ఏఈ ల సంతకాలు లేకుండా ఈ గుమస్తా మరియు డివైఈఈ అవినీతి చేసినారు .
( 8 ) వాటర్ లీకులు వాల్ సిట్స్ పడిపోయినవి అనిచెప్పి బిల్లులు రూపేణా 500000 . 00 తీసుకున్నారు . ఈ 1 గుమస్తా మరియు డివైఈఈ అవినీతి చేసినారు .
( 9 ) పాత 13 వ వార్డు నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు తాలూకు ఎంపీ నిధుల నుండి చేయాల్సిన పని మునిసిపల్ నిధుల నుండి 500000.00 చేసియున్నారు .
( 10 ) పురుషోత్తమపట్నంలో స్మశానవాటిక అభివృద్ది అని 2000000.00 మరియు 1800 000.00 అని ఫైల్సు పెట్టి బిల్లులు తీసుకున్నారు .
( 11 ) పట్టణ అభివృద్ధి అనామత్తు పేరుతో లక్షల రూపాయలు డ్రా చేయుచున్నారు .
( 12 ) కరంటు పోల్స్ , లైటింగ్ , వీధి దీపాలు పేరుతో 2000000.00 బిల్లు చేశారు .
( 13 ) ఎమ్మెల్యే ప్రొగ్రాంలు పెట్టి వాటి తాలూకు ఖర్చు బిల్లులు లక్షల్లో పెట్టినారు . కావున చిలకలూరిపేట మునిసిపాలిటీలో జరిగిన , జరుగుతున్న అవినీతి పై దర్యాప్తు జరి పించాలని బాద్యులను తగినవిదంగా శిక్షించాలని నవతరంపార్టీ డిమాండ్ చేయుచున్నది అని లేఖను అందించారు. ఈమేరకు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తగిన చర్యలు తీసుకుంటామని,విచారణకు అదేశిస్తామని అధికారులు వచ్చిన తర్వాత సమగ్రమైన సమాచారాన్ని అందించాలని రావుసుబ్రహ్మణ్యంను కోరారు.*