రైతన్నలకు అండగా సహకార సంఘాలు ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలో 30.25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను .
_ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ సహకార రంగాల ద్వారా ఎన్నో విలువైన సేవలను అందిస్తున్నారని అన్నారు, గ్రామస్థాయిలో ఆర్బికేల ద్వారా రైతులకు విత్తన మొదలు విక్రయం దాకా సకల సేవలందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని వ్యవసాయ రంగంతోపాటు విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు,ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకున్న ఓరువలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు._
_ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మెన్ తన్నీరు నాగేశ్వరరావు,గ్రామ సర్పంచ్ చావా దుర్గారాణి శ్రీధర్, జడ్పిటిసి యేసుపోగు దేవమణి,ఎంపీటీసీ లావుడియా లక్ష్మి,మండల పార్టీ అధ్యక్షుడు గాదెల రామారావు,గ్రామ పార్టీ అధ్యక్షులు బుజ్జి,సొసైటీ అధ్యక్షులు వాసిరెడ్డి కృష్ణారావు,మండల సమైక్య అధ్యక్షురాలు గంగిపోగు శిరీష,నాయకులు కాటేపల్లి రవి,కనగాల రమేష్,సామినేని లక్ష్మీనారాయణ,కట్ట శ్రీను,పాపినేని రాంబాబు,భూక్యా రాజా,రంగిశెట్టి ముత్తయ్య,యేసుపోగు శ్రీనివాస్,బాణావతు శ్రీను నాయక్,చితకుంట్ల వెంకట రెడ్డి,కొండబోలు బ్రహ్మం,వివిధ గ్రామాల ముఖ్య నాయకులు సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు._