రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా వైద్య పరీక్షలు – యంవిఐ యం రవికుమార్
రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా వైద్య పరీక్షలు – యంఐవి యం రవికుమార్
జగ్గయ్యపేట
34వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా జగ్గయ్యపేట మోటర్ వెహికల్ ఆఫీస్ వద్ద డ్రైవర్ లకు ఉచిత వైద్య పరీక్షలను ఇన్స్పెక్టర్ యం రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ కంటిని మరియు ఆరోగ్యాని సురక్షితంగా ఉంచుకోవాలని,మద్యం సేవించి ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దని,మద్యం సేవించి వాహనాలను నడపవద్దని,సురక్షిత ప్రయాణం కోసం ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటుండాలని ఆయన తెలియజేశారు.జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా డ్రైవర్ లకు రక్త పరీక్ష లు,కంటి పరీక్షలను చేయడం జరిగిందని యంఐవి యంవి రవికుమార్ తెలియజేశారు.దీనిలో భాగంగా 2023 జనవరి 18 నుండి 24 వరకు యన్.టి.ఆర్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్డు పై ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించిన వారిని కేసులలో ఐ విట్నెస్ క్రింద పరిగణలోకి తీసుకోకూడదని,అట్టి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుమతులను అందిస్తూ జీరో మరణాలను శాతాన్ని పెంచడం జరుగుతుందని ఆయన అన్నారు.అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాలపై తప్పోవన స్కూల్ నందు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆలాం ,కానిస్టేబుల్ యన్ వెంకటేశ్వరావు, సిహెచ్ శరత్ చంద్ర,హోంగార్డు వై సువర్ణరావు తదితరులు పాల్గొన్నారు.