పరోపకారం అభినందనీయం – కర్లపాటి
జగ్గయ్యపేట
జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం అభినందనీయమని సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు అన్నారు.
శుక్రవారం కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఆళ్ళ వెంకట భార్గవ్ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహారాన్ని (పోస్టర్ కేర్)అందజేసిన భార్గవ్ రామ్ తల్లిదండ్రులు చైతన్య,హారికలను ఆయన అభినందించారు. సమాజహితం కాంక్షించేవారు ఇటువంటి సాంప్రదాయాన్ని పాటించాలని ఆయన సూచించారు.ప్రతిఒక్కరూ తమ సంతోషాన్ని సేవా కార్యక్రమాలతో ఇతరులతో పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమట్రస్ట్ రూపొందించిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించాలని కోరారు.కాగా ఈ కార్యక్రమంలో ఆళ్ల చైతన్య ,హారిక, పాశం అజయ్ కృష్ణ , శ్రేయస్సు సిబ్బంది కోటేశ్వరరావు, అనురాధ, లక్ష్మి, విజయ కుమారి, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.