విజయవాడ ఆంద్ర లయోల కాలేజి బుర్ఖా వివాదం
విజయవాడ: విజయవాడ ఆంద్ర లయోల కాలేజిలో గురువారం బుర్ఖా వివాదం చెలరేగింది. బుర్కా వేసుకొచ్చిన విద్యార్దినులను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోకి అనుమతించలేదు. అయితే విద్యార్దులు మాత్రం తాము ఫస్ట్ ఇయిర్ నుండి తాము బుర్కాలోనే కాలేజి వెళ్తున్నామమని అన్నారు. మా కాలేజి ఐడీ కార్డులో కూడా తాము బుర్కాతోనే ఫోటో దిగామని అన్నారు. విషమం తెలిసి కాలేజీ వద్దకు ముస్లిం పెద్దలు చేరుకున్నారు.
ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలిసిన విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా ప్రిన్సిపాల్ తో డైరెక్ట్ గా మాట్లాటారు. ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పినట్లు సమాచారం. చివరకు విద్యార్దినిలను కాలేజీలో అనుమతించారు. దాంతో వివాదం సద్దుమణిగింది.