శ్రీ మఠంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
మంత్రాలయం: పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో రథసప్తమి వేడుకలు పీఠాధిపతులు ఆధ్వర్యంలో శ్రీ మఠం అధికారులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రథసప్తమి ని పురస్కరించుకుని మఠంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పూర్వ పీఠాధిపతుల బృందావనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్ల చిత్రపటాలను ఐదు రథోత్సవాలపై బంగారు వెండి నవరత్న వెండి అంబారి కొయ్య రథోత్సవా పై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు.
అనంతరం వేధమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ అశేష భక్తజన వాహినికి మధ్య అంగరంగ వైభవంగా పంచరథోత్సవాలను నిర్వహించారు. ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. అనంతరం పీఠాధిపతులు భక్తులకు అనుగ్రహ సందేశము ఇచ్చి భక్తులను ఫల మంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు.