శోక్ బాబు ను అర్థరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి ? అచ్చెన్నాయుడు
అమరావతి: ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయన్ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన అరెస్ట్ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు తమ్ముళ్లు మీడియాతో మాట్లాడగా.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన రూపంలో స్పందించారు.
అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి.. అరాచకంతో పాలన సాగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.