రథోత్సవంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు పంపిణీ
రథోత్సవంలో పాల్గొన్న మహిళలకు బహుమతులు పంపిణీ
జగ్గయ్యపేట:పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొన్న మహిళలకు స్థానిక పరిమళ కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ షాప్ బహుమతులను అందజేసింది. యాత్రలో పాల్గొన్న వందమంది మహిళల నుంచి ముగ్గురిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందజేసింది. పరిమళ్ కలెక్షన్స్ ప్రోప్రైటర్ కాకరపర్తి సౌజన్య లక్కీ డిప్ విజేతలు నూకల ప్రమీల, సుగ్గల రాజేశ్వరి, చింతలపూడి లక్ష్మి లకు వన్ గ్రామ్ గోల్డ్ గాజుల జతలను అందజేశారు..