సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి: మా అధ్యక్షుడు మంచు విష్ణు
తిరుపతి: చిరంజీవి ఏపీ సీఎం ను కలవడం వ్యక్తిగతం. ఒకరిద్దరు వేరువేరుగా కలిసి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని నటుడు మా అధ్యక్షుడు మంచి విష్ణు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గించింది.. ఇంకో ప్రభుత్వం పెంచింది. అందరు ఏకతాటిపైకి వచ్చి సమస్యని పరిష్కరించుకుందాం. రెండు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఈ ఏడాది ప్రారంభం అవుతోంది. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుంది. సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుంది. టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళదాము.
రెండు ప్రభుత్వాలుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాము… నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేను. రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు… చర్చలు జరుగుతున్నాయి… కలిసి మెలసి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. టిక్కెట్స్ ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసింది. వారు అడిగితే మేము కూడా కలుస్తాము. చిరంజీవి. జగన్ కలయిక పర్సనల్ మీటింగ్… దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదు మా అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడుతానని అన్నారు. .