*”ప్రత్యేక హోదా సాధన కోసం సమర యాత్ర” నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మద్దతు.
*ప్రత్యేక హోదా కోసం జనవరి 20 నుండి ఫిబ్రవరి 4 వతేది వరకు విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి చేపట్టిన ‘సమర యాత్ర” కు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మద్దతు పలికారు.హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు నిర్వహించే బస్సు యాత్రలో నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధి కూడా పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రధాన సమస్యలు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు,రాజధాని నిర్మాణానికి రావలసిన నిధులు,రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజి, గిరిజన,సెంట్రల్, మైనింగ్ యూనివర్సిటీ లకు నిధుల విడుదల,విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్ట్ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల,కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కోరుతూ సమరయాత్ర కొనసాగుతుందని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు,తెలుగుదేశం పార్టీ నుండి కొనకళ్ళ నారాయణ రావు,కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు,మాజీ ఎమ్మెల్సీ జల్ది విల్సన్, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల నేతలు,ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి సభ్యులు,SFI,AISF,NSUI,PDSU,AIYF పలు విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఈ యాత్రలో పాల్గొని విశ్వ విద్యాలయాలు,సందర్శించడం సభలు సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు.*