రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సంధర్బంగా ఓటు వేయడంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేసారు. హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుండగా.. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బదులు పొరపాటున NDA అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఫోటో పై టిక్ చేసారు.
పొరపాటుని గుర్తించిన ఆమె మరో బాలెట్ పేపర్ కావాలని ఎన్నికల రైటర్నిన్ అధికారిని అడిగారు. అధికారులు ఆమెకు మరో బ్యాలెట్ ఇచ్చే విషయమై పరిశీలిస్తున్నారు.