ప్రారంభం కానున్న శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ దేవాలయ షష్ఠ వార్షికోత్సవాలు
~ ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగనున్న వేడుకలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 31 : పేట్ బషీరాబాద్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ దేవాలయ షష్ఠ (6వ) వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ఆగస్టు 1వ తేదీన ప్రారంభించి మూడు రోజులపాటు నిర్వహించనున్నారు.
• మొదటిరోజు (గురువారం)…
ఉదయం 8 గంటలకు గురుప్రార్ధన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, స్థలశుద్ది, భూతోచ్చాటనం, సుదర్శన దిక్బంధనం, అఖండ దీపస్థాపన, దీక్షాధారణ, ధ్వజారోహణం, యోగిని, నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్రమండలఆవాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఆవాహిత దేవతాపూజ, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ట, లక్ష్మీగణపతి, మహాగణపతిహవనం, రాజోపచారాలు చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వితరణ ఉండనుంది.
• రెండవ రోజు (శుక్రవారం)…
ఉదయం 8 గంటలకు మూలమంత్ర అనుష్ఠానం, అష్టోత్తరాలు, సుగంధద్రవ్యాలతో మూలవిరాట్ కు 108 కళశాలతో మహాకుంభాభిషేకం,
ఆవాహితా దేవతా హోమాలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఆవాహితదేవతా పూజ, మూల మంత్ర హవనం, కట్ట మైసమ్మతల్లికి మహాచతుషష్టి పూజ,
లక్షపుష్పార్చన, వేదస్వస్తి, రాజోపచార సేవ అనంతరం తీర్థప్రసార వితరణ చేయనున్నారు.
• మూడవరోజు (శనివారం)…
ఉదయం 7 గంటలకు చండీ నవవర్ణార్చన, మహాచండీ హవనం, అష్టభైరవబలి, మహా బలిప్రదానం, ఉదయం 10:45 గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ, అవబృథస్నానం, వేద ఆశీర్వచనం, పండిత సత్కారం, తీర్థప్రసాద వితరణ, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు ఆలయ నిర్వహకులు వివేక్ రెడ్డి తెలిపారు. ఆయా పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు ఆకాంక్షించారు.