రిపీట్ అయితే… సత్తా చూపుతాం…

• టిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక
• పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు
• సీఎం, శ్రీశైలం గౌడ్ ను విమర్శించే స్థాయి లేదంటూ మండి పాటు
గాజులరామారం (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 18: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ పై పత్రికా విలేకరుల సమావేశంలో మంగళవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గాజులరామారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారికి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, తమ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పై మరోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే గల్లీలో కొట్టుడు ఖాయమని. వారిని ప్రజలే కొడతారని మండిపడ్డారు. లాఠీ దెబ్బలు తిని బయటికి వచ్చిన ఓ కార్పొరేటర్ కూడా ఎగిరెగిరి పడుతున్నాడని, 35 ఎకరాల స్థల పత్రాల ఫోర్జరి కేసులో జైలుకు వెళ్లి వచ్చినా ఇంకా సిగ్గు రాలేదని ఎద్దేవ చేశారు. అంతేకాకుండా రాజీవ్ గృహకల్పలో అదనపు నిర్మాణాల నిందితులు సైతం కూన శ్రీశైలం గౌడ్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడున్న కార్పొరేటర్ లు అంతా శ్రీశైలం గౌడ్ పెట్టిన రాజకీయ భిక్షేనని, ఆయననే విమర్శించే స్థాయి వారికి లేదని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ లో నాళాలు, రేషన్ షాపులు, ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత శ్రీశైలం గౌడ్ కే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించుకొని సొమ్ము చేసుకోవడమే ప్రజా పాలన అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే హైడ్రాకు వారు భయపడుతున్నారని తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేకానంద్ కు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుకు టికెట్ వస్తుందని ప్రచారం చేసిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యే నుంచి ప్యాకేజీలు పొంది ఎమ్మెల్యే కాగానే తమ ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరుగుతున్నారని అన్నారు. శ్రీశైలం గౌడ్ మచ్చలేని నాయకుడని, ఆయనపై ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏంటో చూపిస్తాం ఖబడ్ధార్…అంటూ హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు బొడ్డు వెంకటేశ్వరరావు, పాలకృష్ణ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్నారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంజ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు, డిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్, బండి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓరుగంటి కృష్ణా గౌడ్, బుచ్చిరెడ్డి, కూన రఘు గౌడ్, మోతే శ్రీనివాస్ యాదవ్, జయరాం, రషీద్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బేకు శ్రీనివాస్, పండరి, శివ కుమార్, రాధా కృష్ణ, రహ్మతుల్లా, నాయకులు బాలప్ప, చాంద్ పాషా, రషీద్ బేగ్, కృష్ణ యాదవ్, లాల్ మహ్మద్, మధు సూధన్, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More