మద్యం మత్తులో ఫాక్స్ సాగర్ లో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పేట్ బషీరాబాద్ క్రైమ్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 10: మద్యం మత్తులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుభాష్ నగర్ లో నివాసముండే సాహెబ్ ఖాన్ కుమారుడు నాసర్ ఖాన్ (58) మద్యం సేవించి సమీపంలోని ఫాక్స్ సాగర్ చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లి సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువులో పడిపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో నాసర్ ఖాన్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.