విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయండి.-కొలన్ హనుమంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 14 : తుక్కుగూడలో ఈనెల 17న కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న విజయభేరి బహిరంగ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంతరెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అబ్జర్వర్‌గా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన గురువారం మాట్లాడారు. విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆయా డివిజన్ల నుంచి భారీగా ప్రజలను తరలించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.